ప్రకృతి-వికృతి

తెలుగు ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది.  

ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.

  • 1. గ్రామ్య పదములు  (ఇవి అచ్చ తెలుగు పదములు)
  • 2. ప్రాకృత పదములు ( ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు)
  • 3. వికృత పదములు ( ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదములు)
  • 4. అరువు పదములు ( ఇవి ఉర్దూ, ఆంగ్లం మొ|| భాషల నుండి అరువు తెచ్చుకున్న పదములు )

ఉదాహరణ :

  Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాము.

  •    గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) – ” అలరాటం “
  •    ప్రాకృత పదం  ( సంస్కృతం )        –   ” సంతోషం”
  •     వికృత పదం                                  –   ” సంతసం “
  •     అరువు పదం                                 –   ” ఖుషి “
ప్రకృతివికృతి
అంబఅమ్మ
అక్షరముఅక్కరము
అగ్నిఅగ్గి
అద్భుతము, అపూర్వముఅబ్బురము
అనాథఅనద
అమావాస్యఅమవస
ఆకాశముఆకసము
ఆధారముఆదరువు
ఆశఆస
ఆశ్చర్యముఅచ్చెరువు
ఆహారముఓగిరము
ఆజ్ఞఆన
కథకత
కన్యకన్నె
కవికయి
కార్యముకర్జము
కుంతిగొంతి
కుమారుడుకొమరుడు
కుఠారముగొడ్డలి
కులముకొలము
కృష్ణుడుకన్నడు
ఖడ్గముకగ్గము
గ్రహముగాము
గృహముగీము
గుణముగొనము
గౌరవముగారవము
ఘోరముగోరము
చంద్రుడుచందురుడు
జ్యోతిజోతి
జ్యోతిషముజోస్యము
తంత్రముతంతు
తరంగముతరంగ
తర్కారితక్కెడ
త్యాగంచాగం
తీరముదరి
దిశదెస
దీపముదివ్వె
ద్వీపముదీవి
దుఃఖముదూకవి
దైవందయ్యము
దృఢముదిటము
ధర్మముదమ్మము
ధాతతార
నిత్యమునిచ్చలు
నిద్రనిదుర
నిమిషమునిముసం
నిశానిసి
నీరమునీరు
న్యాయమునాయము
పక్షిపక్కి
పద్యముపద్దెము
పరుషంపరుసం
పర్వంపబ్బం
పశువుపసరము
ప్రజపజ
ప్రతిజ్ఞప్రతిన
ప్రశ్నముపన్నము
ప్రాకారముప్రహరి
ప్రాణముపానము
పుత్రుడుబొట్టి
పుణ్యముపున్నెము
పురిప్రోలు
పుస్తకముపొత్తము
పుష్పముపూవు
బంధువుబందుగు
బలముబలుపు
బహువుపెక్కు
బ్రహ్మబమ్మ, బొమ్మ
బిలముబెలము
భక్తిబత్తి
భగ్నముబన్నము
భద్రముపదిలము
భాగ్యముబాగెము
భారముబరువు
భాషబాస
భీతిబీతు
భుజముభుజము
భూమిబువి
భేదముబద్ద
మంత్రముమంతరము
మతిమది
మర్యాదమరియాద
ముకుళముమొగ్గ
ముక్తిముత్తి
ముఖముమొగము
ముగ్ధముగుద
మూలికమొక్క
మేఘుడుమొగులు, మొయిలు
మృగముమెకము
యంత్రముజంత్రము
యత్నంజతనం
యాత్రజాతర
యువతిఉవిద
రాత్రిరాతిరి
రిక్తమురిత్త
రూపమురూపు
లక్ష్మిలచ్చి
వశమువసము
వర్ణమువన్నె
విద్యవిద్దె
విధమువితము
విజ్ఞానమువిన్నాణము
వేగమువేగిరము
వేషమువేసము
వైద్యుడువెజ్జ
వృద్ధపెద్ద
వృద్ధివద్ది
శక్తిసత్తి
శయ్యసెజ్జ
శాస్త్రముచట్టము
శిఖాసిగ
శిరముసిరము
శీతముసీతువు
శ్రీసిరి
శుచిచిచ్చు
సంతోషముసంతసము
సందేశముసందియము
సత్యముసత్తెము
సముద్రముసంద్రము
సాక్షిసాకిరి
సింహముసింగము
సంధ్యసంజ, సందె
స్తంభముకంబము
స్త్రీఇంతి
స్థలముతలము
హృదయముఎద
చోద్యంసోదెము
రూపమురూపు
ముఖము మొగము, మోము
సందేహముసందియము
యువతిఉవిద
పినాకినిపెన్న
పిత్తళఇత్తడి
కుఠారముగొడ్డలి
కావ్యముకబ్బము
కుమారుడుకొమరుడు
నిజమునిక్కము
పీఠపీట
మతిమది