కాలములు

కాలములు (Kalamulu)-Tenses

1.భూతకాలం

2.వర్తమానకాలం

3.భవిష్యత్ కాలం

1.భూతకాలం:Past tense

జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలాన్ని భూతకాలం అంటారు.

ఉదా:ఆరుష్ బొమ్మలు గీశాడు.

2.వర్తమాన కాలం:Present tense

జరుగుతున్న పని గురించి తెలిపే కాలాన్ని వర్తమాన కాలం అంటారు.

ఉదా:అమ్మ వంట చేస్తున్నది.

3.భవిష్యత్ కాలం:Future tense

జరగబోయే పనిని గురించి తెలిపే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు.

ఉదా:శ్రీహర్ష రేపు అమెరిక వెళతాడు