పర్యాయ పదాలు

ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

  • తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు
  • తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
  • జలధి = కడలి, అర్ణవము
  • పర్వం = పబ్బం, పండుగ, వేడుక
  • శత్రువు = వైరి, రిపు, విరోధి
  • ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
  • నిజము = సత్యము, నిక్కము
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
  • స్త్రీ = వనిత, మహిళ, పడతి
  • జైలు = బందీఖాన, కారాగారము
  • నేల = భూమి, ధరణి, ధాత్రి, పృథ్వి, పుడమి, జగతి, ఇల
  • నిప్పు = మంట, అగ్ని, అగ్గి
  • గాలి = వాయు, పవనం
  • ఆకాశం = భువనము, మిన్ను, అంబరము, ఆకసము, ధ్రువము, దివి, గగనం, అంతరిక్షం, విభువు, చరాచరము
  • నీరు = ఉదకం, జలం
  • కోతి = మర్కటము, కపి, వానరము
  • గుర్రం = అశ్వము, కుదరము, కింకరము, తురగము
  • కుక్క = శునకము, కుర్కురము
  • పంది = సూకరం, వరాహం
  • ఆవు = గోవు, పైరము, ధేనువు, పయిరము, పెయ్య
  • నెమలి = మయూరము, బర్హిరము, హరి, మేఘనాదాలాపి, నట్టువపులుగు, నమ్మి, భుజంగభుక్కు, సారంగము, బర్హి, నీలకఓఠము, శిఖావలము, శిఖికేకి, నెమ్మి.
  • మొసలి = హాదగ్రహము, కడలిరాతత్తడి, మరునిడాలు, కంటకము, క్షీరశుక్లము, కుంభీరము, జలసూచి, ఝషము, ఝషాశనము, నక్రము, మకరము, గిలగ్రాహము, గ్రాహము, జలకంటకము, జలకపి, జిలజిహ్వము, జలనూకరము, అంబుగజము, అన్బుమర్కటము, అసిదంష్ట్రము, కుంభి.
  • నక్షత్రం = చుక్క, తారకము, తార, ఉడుపు
  • బంగారం = పసిడి, పుత్తడి, కాంచనము, వర్ణము, సువర్ణము, పైడి, భూరి, కనకము, స్వర్ణము, భృంగారము, కుసుంభము.
  • సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు, అంబరీషుడు, ఉష్ణుడు, దినకరుడు, దివాకరుడు, ఖచరుడు, ప్రభాకరుడు, పద్మాసనుడు
  • సముద్రం = సంద్రము, సాగరము, సింధువు, అంబుధి, కడలి
  • చెట్టు = వృక్షము, తరువు, మాను, మ్రాను, విటపము, భూరుహము, మహీరుహము
  • శివుడు = ఈశ్వర, కేశవా, శివ, ముక్కంటి, త్రినేత్రుడు, మహేశ్వర
  • పార్వతీదేవి = ఉమ, కాత్యాయిని, గౌరీ,కాళీ, నారాయణి, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ,మేనకాత్మజ, ధేనుక, భార్గవి, శారద, జయ, ముక్కంటివెలది, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గ, చండిక, భైరవి, శాంభవి, శివాణి.
  • విగ్రహము = ప్రతిమ, ప్రతిమానము, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబము, ప్రతికృతి, అర్చ, ప్రతినిధి, ప్రతియాతనము.
  • మానుషుడు = మనుష్యుడు, జనుడు, మర్త్యుడు, మనుజుడు, మానవుడు, నరుడు, పంచజనుడు.
  • యముడు = కొమరుడు, కాలుడు, దక్కిణఓపుసామి, ధర్మరాజు, పితృపతి, యమరాట్టు, దండధరుడు, శ్రాద్ధదేవుడు, సమవర్తి, పరేతరాట్టు, కృతాంతుడు, యమునాభ్రాత, గుడెతాల్పు, శమనుడు, వైవస్వంతుడు, జమునసయిదోడు,పెతరులసామి, జముడు.
  • నిజము = సత్యము, నిక్కము, వాస్తవం.
  • శ్రమ : అలసట, అలుపు, బడలిక.
  • హనుమంతుడు = పవనసుతుడు, ఆంజనేయుడు, మారుతి.
  • శ్రీ వేంకటేశ్వరుడు = బాలాజీ, ఏడుకొండలు, వెంకన్న, వెంకటరమణ. 
  • స్త్రీ = వనిత, మహిళ, పడతి, ఇంతి, అబల, హోమలి, ఆడది.
  • జైలు = బందీఖాన, కారాగారము.
  • మరణము = చావు, కాలధర్మము, ప్రళయము, అంతము, నాశము, హింస, ప్రమీలనము, కాలము చెల్లు, మృత్యువు, త్యజము, నిధనము, దీర్ఘనిద్ర.
  • సామెత : లోకోక్తి, నానుడి, పురాణోక్తి.
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము, తలకాయ.
  • తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు, కుమారుడు, వారసుడు, వంశోధరకుడు, కొమరుడు.
  • జలధి = కడలి, అర్ణవము.
  • వెఱ్ఱివాడు = అపస్మారి, అమాయకుడు, మందబుద్ధి, ఉన్మత్తుడు, వెడగు, వీఱిడి, వేదుఱు, తిక్క, వెంగలి, వెంబరివిత్తు, వెకలి, బుద్ధిహీనుడు.
  • పండుగ = పబ్బం, వేడుక, పర్వం.
  • శత్రువు = విరోధి, వైరి, రిపు, ప్రత్యర్థి.
  • ముఖము = మోము, అరవిందము, మొహము.
  • గుండె = హృదయం, మనసు, మది, ఎద.
  • సోదరుడు = తమ్ముడు, అన్న, తోబుట్టువు
  • మొద్దు = ధ్రువము, మొరడు, మోటు, మోడు, మ్రోడు, శంకువు, స్దాణువు. 
  • స్నేహం = చెలిమి, సావాసం, మిత్రుడు, మైత్రి
  • భార్య = ఇల్లాలు, ఇంతి, పత్ని, సతి, అర్ధాంగి, ఆలి, సహధర్మచారిణి, పెండ్లాము
  • భర్త = మొగుడు, పతి, మగడు, పెనిమిటి, ఇంటాయన
  • రక్తము = నెత్రు, ఎఱ్ఱ, నల్ల, అంగజము, నెత్తురు, రుధిరము, అసృక్కు, హితము, శోణితము, అస్రము, అసృవు, కింకర, కీలాలము, క్షతజము. 
  • నిచ్చెన = తాప, అధిరోహిణి, నిశ్శ్రేణి, ఆరోహణము
  • నింద = నిందనము, పరీవాదము, అపవాదము, దూఱు, సెగ్గింపు, అపదూఱు, అధిక్షేపము, ఉపక్రోశము, ఆక్షేపము, నిర్వౌదము, గర్హణము.
  • మంత్రి = నియోగి, అమాత్యుడు, ప్రెగడ, ప్రెగ్గడ.
  • పాపము = కల్మషము, పంకము, దోషము, దోసము, పాప్మము, ఏనస్సు, అంకము, ఆగము, కలుషము, వృజినము, అఘము, దురితము, దుష్కృతము, కిల్బిషము, ఓఘము.
  • వెండ్రుకలు = కేశములు, కురులు, శిరోరుహములు, చపలములు, చికురములు, నెఱకలు, నెఱులు, కుంతలములు, వాలములు, అంగజములు, అలకములు, కచములు.
  • వెన్న= మంధసారము,హైయంగవీనము, మంధజము, గవీనము, దధిజము, నవనీతము.
  • వైద్యుడు = జైవాతృకుడు, వెజ్జు, మందరి, అగదంకారుడు, భిషక్కు, భిషజుడు, రోగహారి, చికిత్సకుడు, జీవదుడు, జైవాతృకుడు, దోషజ్ఞుడు, ప్రాణదుడు. 
  • శనగలు = సెనగలు, సతీనము, హరేణువు, చణకము, త్రిపుటము.
  • శవము = పీనుగు, కళేబరము, బడుగు, సబము, కటము, కుణపము, క్షితివర్ధనము, పూయము, సబరము
  • శరీరము = కళేబరము, దేహము, మెయి, మేను, ఒడలు, సంహవనము, గాత్రము, వపుస్సు, వర్ష్మ, విగ్రహము, కాయము, మూర్తి, తనువు.
  • శపధము = ప్రతిజ్ఞ, ప్రమాణము, ఆన, ఒట్టు, బాస, ప్రతిన, ప్రత్యయము, సంగరము, బాఢము, సంధ్య సత్యము, శపనము, పణము, పరిగ్రహము.
  • బంతి = చెండు, గేందుకము, గేందువు, కందుకము, గుడము, గేండుకము.
  • బంధువులు = బందువు, చుట్టలు, చుట్టాలు, చుట్టములు, విందులు, బందుగులు.
  • పొగ = అగ్నివాహము, ఆవిరి, మేచకము, మరుద్వాహము, , కచమాలము, ఖతమాలము, ధూమము, మేఘయోని, ధూపము, పోన, వ్యామము, శిఖిధ్వజము.
  • పౌరుషము = మగతనము, విక్రమము, మగటిమి, కడిమి, గండు, బీరము.
  • ప్రేమ = అభిమానము, ఆబంధము, అనురక్తి, రాగము, అనురాగము, ప్రణయము, అభిమతి, అనుగు, అనురతి, మురిపెము, మక్కువ, ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి.
  • ప్రయాణము = గమనము, యాత్ర, వ్రజ్య, గమము, ప్రస్ధానము.
  • పేగు = ఆంత్రము, ఇడ, ధమని, పురీతత్తు, సిర. 
  • యవ్వనము = యౌవనము, పరువము, పాయము, ప్రాయము, జవ్వనము, యక్తవయసు.
  • యుద్ధము = పోట్లాట, వివాదము, గొడవ, పోరాటం, కలహము, తలపడు, సమరము, దురము, పోరు, అభ్యామర్దము, చివ్వ, రణము, ఆస్కందనము, ప్రధనము, ప్రవిదారణము, సంస్ఫోటము.
  • యజ్ఞము = సవము, సవనము, హవము, ముఖము, క్రతువు, మన్యువు, అధ్వరము, యాగము, సప్తతంతువు. 
  • మొలక = మోము, మొక్క, మోటిక, మోసు, అంకురము, నిసువు.
  • వాన = వర్షము, చిత్తడి, అంబరీషము, వృష్టి, ఆసారము, జడి, జల్లి, జల్లు, తొలకరి, దల్లు, ముసురు, సోవ, మేఘపుష్పము.
  • వాయుదేవుడు = కరువలి, తెమ్మెర, ఈద, గంధవాహుడు, అనిలుడు, ఆశుగుడు, సమీరుడు, నభస్వంతుడు, మారుతుడు, వలి, మరుతేరు శ్వసనుడు, స్పర్షనుడు, మాతరిశ్వుడు, పృషదస్వుడు, గంధవహుడు, మరుత్తు, జగత్ప్రాణుడు, సమీరణుడు, వాతుడు, పవమానుడు, ప్రభంజనుడు, ప్రకంపనుడు, అతిబలుడు.